DARPANAM

DARPANAM

Wednesday, December 7, 2011

నానోలు

డబ్బులు
ఇచ్చి
"పుచ్చు"
కొంటున్నాము


నురుగు
నవ్వుల
పరిహాసం
-బీరు


నల్లని
విజ్ఞానపు
దీపాలు
-అక్షరాలు 

Tuesday, November 1, 2011

తెలుగుతల్లి

మాలాలంక్రితియైన  మా  తెలుగుతల్లిని 
దర్శి౦చకు0డా ఎవరూ మా ఉక్కునగరం 
లోపలకు రాలేరు.అందరినీ సాదరంగా ఆహ్వానిస్తుంది 
అందుకే మా స్టీల్ టౌన్షిప్  తెలుగంత తీయగా,


మా తెలుగు వనమంత చల్లగా ఉంటుంది   

Monday, October 10, 2011

నానోలు

1   అక్షరపు 
     ఆయుధాల
     కర్మాగారం 
      _ కలం 

2    రెండు 
      ముక్కల
      మధ్యవర్తి 
      _టెంకాయ 


3    కనుల
      అనుకోని 
      అతిధులు 
      _కలలు


4    జీవన
      పుష్పపు 
      మరందం 
      _సత్ప్రవర్తన 


5     సూర్యుడి
       వెలుగు
       చంద్రుడి
       దానం  

Thursday, September 22, 2011

తిరత్ఘర్&చిత్రకూట్ జలపాతాలు


ఈ నెల 9 న చత్తీస్ గడ్ సైట్ సీయింగ్ కు వెళ్ళాము.జగాదల్పూర్ కు 38 కి.మీ దూరం లో 
పై రెండూ జలపాతాలు ఉన్నాయి.వైజాగ్ -కిరండూల్ పాసంజర్ లో వెళ్తూ జగదల్ పూర్ లో
దిగాలి.నైట్ స్టే చెయ్యాలి.ట్రైన్ ఉదయం 6 -30  కు బయలుదేరి జగదల్ పూర్ సా-5 .30 
చేరుతుంది.జనరల్ టికెట్ .రూ.43 -----రిజర్వేషన్ --రూ.102   అంతే
అక్కడ  స్టేషన్ కు ఎదురుగా "అతిధి"అనే లాడ్జ్  ఉంది .డబుల్ బెడ్ రూం --రూ.450 
(టి.వి.&ఫోన్తో )     

Friday, September 2, 2011

నండూరి లేరు

పత్రికా సంపాదకత్వమం అంటే ప్రజల తరఫున వకాల్తా 
పుచ్చుకోవాడమని,పత్రిక నడపడమం అంటే నీతినియమాలకు 
కట్టుబడి ఉందడమని,ప్రజలను పుస్తకాల్లోకి తలలు దూర్చేలా చేయడం 
అంటే అక్షరాలకు అనంత శక్తులను ఆపాదించాలని ఎరిగిన మన 
నండూరి ఇక లేరు   

Monday, August 29, 2011

తెలుగుభాషా దినోత్సవం

 తామర తంపరగా పడుతున్న పరభాషా  చినుకులు తెలుగుభాషా సౌకుమార్యాన్ని
తడిపేస్తున్న వేళ,ఆ భాషా సౌ౦దర్యాన్ని తడవకుండా గొడుగు పట్టినవాడే మన గిడుగు. 
అటువంటి మహామనిషిని స్మరి౦చుకోవటం మనందరి కర్తవ్యం.
     గిడుగు రామమూర్తి గారి శతజయంతి సందర్బంగా  మీ అందరికీ (కాదు కాదు)
మన అందరికీ తెలుగు భాషా దినోత్సవ సుభాకా౦క్షలు    
                                                
                                                        

Friday, August 19, 2011

మనం మారమా?

  అన్యాయాన్ని,దోపిడీని సహించలేనితనం ప్రతి మనిషిలో ఉంటుంది.ఐతే మనమున్న కాలమానపరిస్తితులబట్టి మనమే ఆ ఎలిమెంట్ ను  అనగాదోక్కుతూఉంటాం.అదృష్టవశాత్తు ఎ మహానుభావుడో నడుంకట్టినపుడు,మనలో దాగిన ఆ అంకురం మహావృక్షంగా మారుతుంది.ఆ నీటిబిందువు మహాప్రలయంగా విజ్రుంబిస్తు౦ది.అలా  ఓ మహానుభావుడు "అన్నా"రూపంలోమనముందు నిలిచినపుడు,ఆ చిరుదీపాన్ని మహాజ్వాలగా మార్చుకునే క్రమంలో ప్రతిఒకరూ తమలో దాగిన అంకురాల్ని చమురుచుక్కలుగా మారుస్తూ ఆ దీపానికి పోస్తున్నారు.ఒక మంచి కార్యానికి ఎపుడూ అందాడందలుఉంటాయని నిరూపిస్తున్నారు.దేసమంతా ఏకతాటిపై నడుస్తుంది.అంతాబాగుంది ......కానీ  ....
ఓ యువనాయకుడు దోచుకున్న ఆస్తులు సోదాచేస్తుంటే కొంతమంది నిరసనలు తెలుపుతూ ధర్నాలు చేస్తున్నారు.అవి అక్రమాస్తులని 
వాళ్లకు తెలియదా?  కొంచం ఆలోచించి,వ్యతిరేకి౦చకపోయినా మిన్నక ఉండండి .                   

అబ్బా|....ఎప్పుడూ ఒకటే ఏడుపా?

దాదాపు అందరూ ఎన్నో విషయాలపై మంచి మంచి పోస్టులు,అరుదైన ఫోటోలు,కొన్ని దశాబ్దాల క్రిందటి సాహిత్యం,అపురూపమైన అనుభూతులూ,ముచ్చట్లూ,మనం చూడనీ,చూడలేని ప్రదేశాలూ ఒకటేమిటి మరో ప్రపంచాన్నే మనముందర నిలుపుతున్నారు.ముందుగా ఆ శ్రమకూ,తపనకూ,విషయ సృష్టి కర్తలైన  బ్లాగర్లందరికీ శతకోటి నమస్సులు."కూడలి"ఓపెన్ చేసి,మంచి   హుషారుగా చూస్తుంటాం ,ఇంతలో ఒకపోస్ట్ మనకు కనిపిస్తుంది మనసా తుళ్ళి పడకే అంటూ.అంతే| నరనరాన నిస్సత్తువ. ఇక్కడ చెప్పేదేమిటంటే ఆ   కవితల్లో విషయం లేదని కాదు,మంచి డెప్త్ ఉంది అనంతమైన వేదన ఉంది.కాని ఎపుడూ అదేనా? మనిషన్నాక ఎన్నోఎన్నోఎమోషన్స్ ఉంటాయ్ వాటినీ పోస్ట్ చెయ్ అంతేకాని మనమేదో అంతులేని సోకసాగారం లో ఉన్న్నామని,దాన్ని తీసుకు పోయి ప్రపంచం మీద రుద్దటం సరికాదు,అవికూడా స్టీరియో టైప్ ఒకేలా ఉంటున్నాయి.చెప్పలేని బాధను,ఆకలినీ పంటిబిగువున దాచి,ప్రపంచానికి నవ్వటం నేర్పిన చాప్లిన్ మనకు గుర్తు రాదా? ------ఇది కించపరచాలని కాదు ..దయచేసి పొజటివ్ గా తీసుకోమని  నా మనవి    

దాదాపు అందరూ ఎన్నో విషయాలపై మంచి మంచి పోస్టులు,అరుదైన ఫోటోలు,కొన్ని దశాబ్దాల క్రిందటి సాహిత్యం,అపురూపమైన అనుభూతులూ,ముచ్చట్లూ,మనం చూడనీ,చూడలేని ప్రదేశాలూ ఒకటేమిటి మరో ప్రపంచాన్నే మనముందర నిలుపుతున్నారు.ముందుగా ఆ శ్రమకూ,తపనకూ,విషయ సృష్టి కర్తలైన  బ్లాగర్లందరికీ శతకోటి నమస్సులు."కూడలి"ఓపెన్ చేసి,మంచి   హుషారుగా చూస్తుంటాం ,ఇంతలో ఒకపోస్ట్ మనకు కనిపిస్తుంది మనసా తుళ్ళి పడకే అంటూ.అంతే| నరనరాన నిస్సత్తువ. ఇక్కడ చెప్పేదేమిటంటే ఆ   కవితల్లో విషయం లేదని కాదు,మంచి డెప్త్ ఉంది అనంతమైన వేదన ఉంది.కాని ఎపుడూ అదేనా? మనిషన్నాక ఎన్నోఎన్నోఎమోషన్స్ ఉంటాయ్ వాటినీ పోస్ట్ చెయ్ 
అంతేకాని మనమేదో అంతులేని సోకసాగారం లో ఉన్న్నామని,దాన్ని తీసుకు పోయి ప్రపంచం మీద రుద్దటం సరికాదు,
అవికూడా స్టీరియో టైప్ ఒకేలా ఉంటున్నాయి.చెప్పలేని బాధను,ఆకలినీ పంటిబిగువున దాచి,ప్రపంచానికి నవ్వటం నేర్పిన చాప్లిన్ మనకు 
గుర్తు రాదా? ------ఇది కించపరచాలని కాదు ..దయచేసి పొజటివ్ గా తీసుకోమని  నా మనవి          

Thursday, August 11, 2011

స్వయంకృతాస్త్రం



 ఉరిక౦బపు కళాశాలలో
 అమరత్వపు పట్టాపొ౦దిన
 భగత్ కే తెలియదు 
 స్వత౦త్ర౦ వచ్చినరాజ్య౦లో
 కుత౦త్రపు నాయకులు౦టారని
 మన్య౦లో జ్వాలలురేపిన
 అల్లూరికీ తెలియదు
 తమజాతినే 
శ౦కరగిరిమాన్యాలు పటి౦చే
అధికారులొస్తారని
  మరి 
ఓటుబిక్ష౦ వేసిన
నాకే౦ తెలుస్తు౦ది
నేను వేసిన బిక్ష౦
నా బ్రతుకునే మట్టుబెట్టే 
అస్త్ర౦ అవుతు౦దని  

Friday, July 15, 2011

చూస్తున్నా!.....చూస్తున్నా!

మొన్న చూసాను నిన్ను
నాడు శ్రమజీవికి నీవొక దన్ను

నిన్న చూసాను నిన్ను
నీ ఆశావాదపు కాయానికి
అవకాశవాదపు తొడుగులున్నై

నేడుచూస్తున్నా నిన్నే
నీవు లేవు
నీ నీడ ఉంది
అది
శ్రమదోపిడి జాడలో
పయనిస్తుంది

Friday, June 17, 2011

నా చిన్నప్పటి సినిమాలలో నేను కొన్ని విషయాలను గమనించే వాణ్ణి
కొన్ని బానర్సి కి  కొందరు మాత్రమె  సంగీతదర్సకత్వం చేసేవారు.

జెమినీ ప్రొడక్షన్స్ ------వి.కుమార్ 
ప్రసాద్ ఆర్ట్ పిక్షర్స్ ----టి.చలపతి రావు 
ఎం.ఎ.టి            ------టి.వి.రాజు 
భాస్కర చిత్ర     -------ఎస్.హనుమంతరావు(ఎస్.రాజేశ్వరరావు తమ్ముడు)
ఉషశ్రీ  ప్రొడ"     --------అశ్వద్ధామ  
విజయమాధవి  ------జే.వి.రాఘవులు 


అలాగే కొందరు సంగీత దర్శకులు తెలుగులో అతి తక్కువ చిత్రాలకు 
ఇంకాచెప్పాలంటే ఒకే చిత్రానికి  చేసిన వారూ ఉన్నారు 

సి.రామచంద్ర      ---అక్బర్ సలీం అనార్కలి 
విజయా కృష్ణ మూర్తి -రాజకోట రహస్యం,చిట్టితల్లి
టి.జి .లింగప్ప ---తాతమ్మకల 
సలీల్ చౌదరి  -----చైర్మన్ చలమయ్య 
శంకర్ జైకిషన్ --జీవిత చక్రం 
ఇంకా చాలా ఉన్నప్పటికీ వీరు చేసిన ఆల్బమ్స్  సూపర్ హిట్ 
కాదంటారా

     

Sunday, June 12, 2011

నీ రాకకై


నిదురిస్తున్న ఎద
ఉలిక్కిపడి లేచిచూస్తే
ఎదురుగా
నీ జ్నాపకాల మరకలు
ధ్యానముద్రలో ఉన్న ఋషికి
తపోభ౦గ౦ కలిగి౦చినట్లు
అపుడెపుడో
నీవు విసిరిన
చిలిపి చూపుల తూపులు
ఇప్పటికీ నా క౦టి కుహరాళ్లో౦చి
పరుగెడుతూనే ఉన్నవి
నా ఎదను తాకటానికి
నిశా౦త చ౦ద్రికనై
నీరశి౦చిపోతున్నా
దిశా౦తాల వైపు
చూస్తున్నదె౦దుకో తెలుసా
మళ్లీ పూర్నిమ వస్తు౦దని
నాకు తెలుసు గనుక

Wednesday, May 11, 2011

ఆమె(ప్రకృతి )


       ఆమె(ప్రకృతి )
నీ ప్రయోజనాలకై
నిలువెల్లా నీవు చేసిన గాయాలు
నిరంతరం ఆమెను సలుపుతూనే ఉన్నాయి
నీ స్వప్న లోకాల సాక్షాత్కారం కోసం
ఆమె అణువణువూ
చిన్నాభిన్నమవుతుంది
ఆమె ప్రాణం నీకు
ఉఛ్వాశాలవుతున్నా
నీ నిశ్వాసా దుర్గంధాలు
ఆమెను దగ్ధదృశ్యం చేస్తున్నాయి
ఆమె పొత్తిళ్లలో
ఒత్తిగిల్లుతున్న నీవు
ఫలపుష్పాలను ఆస్వాదిస్తూనే
ఆమె వ్రేళ్లను సాంతం పెరికేస్తున్నావు
ఇప్పుడామె నేత్రాలు
నిర్మల కటాక్ష వీక్షణాలకు
ఆలవాలం కాదు
భయానక జ్వాలాముఖీ జ్వలిత
కిరణద్వయం
ఆమె స్పర్శ
మాతృ హృదయ గర్భిత
మమతానురాగం కాదు
నిన్నూ,నీ స్వార్ధ ప్రయోజనాన్ని
అమాంతం
అదఃపాతాళానికి త్రొక్కే
పదఘట్టనల సునామీ

Wednesday, April 27, 2011

స్వరాజ్య సంబరాలు

1947 ఆగస్ట్ 16 న ధిల్లీ వీదుల్లో తిరుగుతూ స్వేచ్చా సంబరాలు ఎలా జరుపుకున్నారో చూడాలని ఉందా?
ఐతే ఇదిగో మీకోసమే అప్పటి ఫోటోలు  మొదటి    








Sunday, April 24, 2011

నేను


ఈ నెల "కౌముది"పత్రికలో నా కవిత"నేను"చదివి
నన్ను ప్రోత్సహిస్తారని కోరుకుంటున్నాను

Thursday, April 21, 2011

మన హీరోలు


సినీ హీరోలను ఒక విధంగా వర్గీకరించాలని అనిపిస్తూ ఉంటుంది.
ఊరకనే ....మీరూ కాసేపు నాతో పంచుకోండి
మన పాత తరం హీరోలు నాగయ్య,వల్లం నరసింహారావు,సి.హెచ్.నారాయణరావు వీళ్లంతా కంచు,ఇత్తడి గ్లాసుల్లాంటి వాళ్లు. ఊరకే అటకమీద ఉంచటానికి తప్ప వాడలేము. ఏ.ఎన్ ఆర్,ఎన్.టి.ఆర్,క్రుష్న,శోభన్ బాబు మొ,,వాళ్లంతా స్టీల్ గ్లాసుల్లాంటి వాళ్లుఅప్పుడప్పుడు వాడోచ్చు,ప్రక్కనా ఉంచోచ్చు.
చిరంజీవి,నాగార్జునా,వెంకీబాలయ్య మొ,, వాళ్లంతా గాజుగ్లాసుల్లాంటి వాళ్లు కొంతలో కొంత లేటెస్ట్ కనుక వాడుకోవచ్చు.మరి ఈ తరంలో క్రొత్త హీరోలంతా ప్లాస్టిక్ గ్లాసుల్లాంటివాళ్లు.ఆ క్షణానికి ఉపయోగించి పారేయటమే........  కదా

Wednesday, April 20, 2011

టివి లో తెలుగు

తెలుగు టివి కార్యక్రమాల్లో యాంఖరింగ్ చూస్తుంటే మతి పోతుంది. ఆయా దర్శకులు చెప్పరేమో. ముఖ్యంగా "చ"మరియు"జ" అక్షరాలను పలికిన ప్రతిసారీ పంటికింద రాయి పడ్డ ఫీలింగ్.ఈతరం పిల్లలంతా చూస్తుంటారు కదా, వాళ్లు కూడా అదే సరళిని అనుసరిస్తారు.దయచేసి ఆధునిక తెలుగునే కాస్త అందంగా,సాంప్రదాయంగా అందించటానికి ప్రయత్నించండి   

Saturday, April 9, 2011

My VALUABLE LESSONS: మీకు మానవత్వం ఉంటే ఈ మెయిల్ ని..

మీరు అందించిన ప్రతి సమాచారం చాలా
విలువైనది.సైటుకి సార్ధక నామధేయం పెట్టారు
రాజ్ గారూ

Tuesday, April 5, 2011

ఆమె


నీ ప్రయోజనాలకై
నిలువెల్లా నీవు చేసిన గాయాలు
నిరంతరం ఆమెను సలుపుతూనే ఉన్నాయి
నీ స్వప్న లోకాల సాక్షాత్కారం కోసం
ఆమె అణువణువూ
చిన్నాభిన్నమవుతుంది
ఆమె ప్రాణం నీకు
ఉఛ్వాశాలవుతున్నా
నీ నిశ్వాసా దుర్గంధాలు
ఆమెను దగ్ధదృశ్యం చేస్తున్నాయి
ఆమె పొత్తిళ్లలో
ఒత్తిగిల్లుతున్న నీవు
ఫలపుష్పాలను ఆస్వాదిస్తూనే
ఆమె వ్రేళ్లను సాంతం పెరికేస్తున్నావు
ఇప్పుడామె నేత్రాలు
నిర్మల కటాక్ష వీక్షణాలకు
ఆలవాలం కాదు
భయానక జ్వాలాముఖీ జ్వలిత
కిరణద్వయం
ఆమె స్పర్శ
మాతృ హృదయ గర్భిత
మమతానురాగం కాదు
నిన్నూ,నీ స్వార్ధ ప్రయోజనాన్ని
అమాంతం
అదఃపాతాళానికి త్రొక్కే
పదఘట్టనల సునామీ

Friday, March 18, 2011

సుధాకర్ కవిత


జాషువా గూర్చి సుధాకర్ వ్రాసిన కవిత్ చాల బాగుంది.
 ముఖ్యంగా "రోమ్ నగరం" .. మరియు "వీళ్ళేం చేస్తున్నారో" అన్న వాక్యాలు చాలు,
 మనుషుల్లో ఏమాత్రం ఇంగితం ఉన్నా అంతర్మదనం ప్రారంభమవుతుంది.

Monday, March 7, 2011



ఒకే వేదికపై శ్రీయుతులుకాళీపట్నం రామారావు,ద్విభాష్యం రాజేశ్వరావు,చాగంటితులసి,ఎల్.ఆర్.స్వామి,
గొల్లపూడిమారుతీరావు,వివినమూర్తి,అవసరాలరామకృష్నారావు,అర్నాద్పి.వి.శేషారత్నం,ఆదూరిసీతారామమూర్తిఘండికోటబ్రహ్మాజి,కాశీవిశ్వనాద్,వాసిరెడ్డినవీన్,అట్టాడ అప్పలనాయుడు,గంట్యాడగౌరునాయుడు
రామతీర్థ ఒక్కరేమిటి ఎందరో అంద్రిమధ్యారోజంతా గడిపాను

Sunday, March 6, 2011

సాహితీ సంబరం



దశాబ్దాలు మారినా పత్రికా రంగంలో తన ఉనికినీ
నాణ్యతనూ నిలుపుకుంటున్న వారపత్రిక "నవ్య"
సాహితీ రంగంలో లబ్దప్రతిష్టులైన కథకుల పరిచయాలూ
వారికిష్టమైన కథలను "నవ్య నీరాజనం" పేరుతో వంద
వారాలపాటు ప్రచురించటమంటే మాటలు కాదు. అందువలన
సాహిత్యాభిమానులకు ఆయా రచయితలను మరింత దగ్గరగా
చూసిన అనుభూతి కలుగుతుంది.
ఇదంతా ఒక ఎత్తైతే  ఆ కథల సమీక్షణం పేరుతో  ఆ రచయితలం
దరినీ ఒక వేదిక మీద కలపటం,ఒక రోజంతా అందరూ గడపటమూ
నిజంగా నాలాంటి సాహిత్యాభిమానికి పండగే.

Sunday, February 20, 2011

tv 9 rahasyam


తెలుగు భాష మీద అభిమానం,పట్టుఅందరికీ
ఉండొచ్చు.కానీ భాషను,అందులోని పదాలను
ఉపయోగించుకొనేనేర్పు కొందరికే ఉంటుంది
ఇటీవలి కాలంలో అక్షరాలలో కలం ముంచి
హృదయ కాన్వాసులపై దృశ్యకావ్యాలను
అద్దుతున్న బొల్లేపల్లి శ్రీధర్ ను అభినందించ
కుండా ఉండలేము. దానికి ప్రశాంత్ వాయిస్ ఇంకాబాగుంది.
విషయం ఏదయినా కావచ్చు,కానీ కేవలం భాషలోని
సోయగం కోసమే  TV9 లోఆ ప్రోగ్రం(రహస్యం)
చూస్తున్నామంటే నమ్ముతారా టీమ్ కు అభినందనలు
కొనసాగించండి

Friday, January 14, 2011

dooram

ఎదగటమంటే
అంతరిక్షంలోనో
ఆవలనున్న గ్రహాలపైనో
ఆవాసం కాదు.........
నీ యింటికీ
నీ ప్రక్కింటికీ
దూరాన్ని తగ్గించటం