DARPANAM

DARPANAM

Monday, March 26, 2012

వెన్నెల దారి

ప్లాస్టిక్ పూలపై 
పెరఫ్యూం జల్లినట్టు 
చిరునవ్వులకు 
నాగరికత అద్దుకోలేను
మంద్ర సంగీతాలూ 
మసక వెలుతురులూ
కొసరి కొసరి తినిపించే 
కొవ్వుముద్దలను కతకలేను 
నా పయనం ప్రత్యేకం 
నా గమ్యం అనివార్యం 
మూడొ౦తుల దారి 
చీకటి గమనం 
అడివంతా పల్లెరుకాయలే
మధ్యమధ్యలో 
"బ్యూరోక్రసీ"మార్క్ 
దువ్వెనల పలకరింపు 
శీతల పవనాలూ 
గ్రీష్మ తాపాలూ 
నాకు అనుభవాలే గాని 
అడ్డంకులు కావు 
కొన్నికోట్ల అశ్రుదారలకు 
ప్రతినిధిని నేను 
నా కా౦క్షె   
వెన్నెలై 
వేకువకు దారి చూపిస్తుంది 
నిఖిల జగతీ 
నిశ్చల సుషుప్తి లో ఉన్నా 
నీరవ నిశీధిలో 
నా పయనం సాగుతూనే ఉంటుంది