DARPANAM

DARPANAM

Sunday, January 29, 2012

మా ఉక్కునగరం(వైజాగ్ స్టీల్)లో "సాహితీ రత్నాలు" పుస్తకావిష్కరణ
సందర్భంగా వేదికకపై శ్రీ రామతీర్థ,శ్రీమతి జగద్ధాత్రి గారితో నేను

Saturday, January 21, 2012

తస్మాత్ జాగ్రత్త


నీ 
చూపుడు వ్రేలి చుట్టూ    
బిగుసుకు౦టున్న బాల్యాన్ని 
అలవోకగా రెసిడెన్సియలలో 
విదిల్చితే .......


రేపది పెరిగి పెద్దదై
నిన్ను 
ఒల్దేజ్ హోములలో 
ప్రతిష్టిస్తది     

మమ్మల్ని కలపరూ

విజయనగరం జిల్లా గర్బాం స్కూల్లో
1980 మార్చ్  లో10th class కంప్లీట్ చేసిన బాచ్ ఎవరైనా ఉంటే
దయచేసి ఈ నంబర్ కు కాంటాక్ట్ చేయగలరు   
  ఫోన్  నంబర్; 9989423447;,  9494187178   

Wednesday, January 18, 2012

ఇటీవలే నంద్యాలలో తన " శ్రీకాంత క్రుష్ణమాచార్యకు"ఆంధ్రప్రదేశ్ నంది అవార్డ్ తీసుకొని ఇంకా దాని రిబ్బనైనా విప్పకుండా వెళ్ళిపోయారు.(క్షమించాలి చేతులు కదలటం లేదు వివరాలు రేపు పోస్ట్ చేస్తాను )     

sad news

మా గురువుగారు ,
  ప్రముఖ కవి,రచయిత,ప్రయోక్త,రేడియో,కళాకారులు
స్నేహశీలి,అభ్యుదయరచయితల సంఘం అధ్యుక్షులు
శ్రీ విరియాల లక్ష్మీపతి గారు పరమపదిమ్చాచారని
 తెలియజేయటానికి చింతిస్తున్నాను 

Monday, January 16, 2012

चास्मसा के 
मुझे  हर गाव पे 
यादाती है 
रास्ता भूल नजावू  
 कही मैखानेका  అని అంటారు ఓ పాకిస్తాన్ కవి  
              దానికి మన గుంటూరు శేశే౦ద్రశర్మ గారు 
ఎలా  అనువదించారో చూడండి 

"ప్రియురాలి కళ్ళు నాకు 
జీవితపు  ప్రతి మలుపులో 
జ్నాపకం వస్తున్నాయి 
ఎక్కడ మర్చిపోతానో 
మధుశాలరాస్తా " 

Thursday, January 12, 2012

కడిగిన ముత్యం

మా ఉక్కు నగర అందాలలో మరో భాగమే
ఈ జగన్నాధ ఆలయం.ఉత్కళ సంస్కృతీ సాంప్రదాయాలకు,
శిల్ప కలలకూ  దర్పణంగా నిలుస్తుందనటంలో ఏ సందేహం
లేదు. ఓ సాయం సమయం,కురిసి వెలసిన వానలో
కడిగిన ముత్యంలా  ఎలా మెరుస్తుందో చూసారా........        
ఈ ఫోటోను   మిత్రుడు,రాం స్టూడియో అధినేత  రాము తీసాడు

Tuesday, January 3, 2012

ఎదగడమంటే......

ఎదగాతమ


ఎదగడమంటే
మన మూలాల్ని 
మన పాదాలతో 
మనమే 
అనగత్రోక్కటం  కాదు 
మనతో పాటు 
అత్యున్నత  శిఖరాలకు
తీసుకుపోవటం 

ఎదగటమంటే  
మనల్ని 
నిలువెల్లా అల్లుకున్న 
తీగల్ని 
పుటుక్కున 
తెమ్చేయటం కాదు
కమనీయ స్పర్శను  
వాటికి కానుక చేయటం 

ఎదగటమంటే  
చండ్రనిప్పులను
ఎగజిమ్ముకుంటూ
నింగిలోనికి 
ఎగిరిపోవటం కాదు 
మమతానురాగాల 
జలా౦త్రగాములై 
జనసంద్రపు 
అట్టడుగు పొరలలో 
పయనించటం కూడా 

 ఎదగటమంటే  
మానవత్వాన్ని 
మనిషి తత్వాన్ని 
విషర్జించటం కాదు 
అవే  
నీ అన్నపానీయాలవటం 

ఎదగటమంటే  
అంతరిక్షం లోనో
ఆవలివైపునో 
నివశించట0 కాదు 
నీ ఇంటికీ  ప్రక్కింటికీ 
పెరిగిన దూరాన్ని తగ్గించటం 

ఎదగటమంటే 
నీ అస్థిత్వానీ కోల్పోయి 
రూపాయిగా 
రూపాంతరం చెందటం 
అంతకన్నా కాదు 
నీ జీవితపు దస్తావేజుకి 
నిలువెత్తు   
సంతకమవటం