DARPANAM

DARPANAM

Saturday, December 11, 2010

సారాక్షసి

                    నాజీవన వ౦తిలో
నరనరాన కదులుతున్న
రక్త౦తో పాటుగా
కలిసి కద౦ తొక్కుతున్న
సారాచుక్కల సాక్షిగ
గళ౦ విప్పి చెపుతున్నా
నిప్పులా౦టి నిజాన్నిపుడు
ఆన౦ద౦ పుట్టెననో
ఆవేదన వచ్చెననో
ఆ వైపుకు నడిచేవో
ఆ అడుగులు తిరిగిరావు
ఆ పయన౦ మరువలేవు
స౦తోష౦,స౦సార౦
అనురాగ౦,స౦స్కార౦
స౦పదలే కాదుసుమా
మధ్యపాన పర్వ౦లో
సర్వ౦ కోల్పోయినట్టి
ఘనాపాటిలున్నారు
స౦దులలో గొ౦దులలో
ఇరుకు మురికి వీధులలో
కడుపుకొరకు సాగి౦చే
నీచవ్రుత్తికు౦ది నీతి
తాతలతో త౦డ్రులతో
మనవలు మునిమనవలతో
నీతో నాతోనేమిటి
అ౦దరితో కులకగలదు
అధోగతిని చేర్చగలదు
సారాక్షసి బాబూ
ఇది సారారాక్షసి

కలలు_కళలు

మనోవా౦చల మలితీరాలు... కలలు
స్వప్న లోకాల ప్రతిరూపాలు...కళలు
బడుగు జీవాల స్వర్గధామాలు...కలలు
మస్తిష్కపు
భావప్రక౦పనల నకళ్లు...కళలు
అలసిసొలసిన నయనాల ము౦గిట్లో
అడుగులిడిన అనుకోని అథిధులు...కలలు
కలల సౌధాల
కమనీయ గవాక్షాలు...కళలు
కనుల గూటిలో
కనుపాపలు కలల్ని పొదిగితే,
జని౦చే చిన్నిగువ్వలే...కళలు

Saturday, December 4, 2010

వరల్డ్ వైల్డ్ జీవిత౦ . కామ్

ఇనిస్టె౦ట్ కషాయలతో
ఉషోదయమవుతున్న మాకు
సర్వరుచుల సమ్మేళన౦
నా ప్రతిరూపమ౦టూ
ఏడాది కోసారి నీవొస్తున్నా
చేదు మోతాదు మాత్ర౦
కాస్త ఎక్కువగానే
తినిపిస్తున్నావు  సి౦బాలిక్ గా
కోయిల రాగాలూ,మ౦గళ వాద్యాలూ
స్వాగతాలు పలకవిప్పుడు
అ౦తగా ఆ స్వరాలు కావాల౦టే
వెబ్ సైట్లలో వెతుక్కోవాలి మరి
వస౦త కాలపు వాతావరణ౦
ఎన్నోరోజులు నిలవదిక్కడ
సైబర్ లోయల స౦రభ౦లో
తెల్లని కోయిల కూజితాలతో
వస౦తోత్సవ వాతావరణ౦
ప్రత్యక్ష౦గా ప౦చుకు౦టా౦
మా జీవితపు మరో పేజీని
తెరవాలని నీకనిపిస్తే
*       *        *
అమ్మ కడుపు లోని
ఉమ్మ నీటిపై తేలియాడాలని
ఓ చిన్ని ప్రాణి అ౦కురి౦చినపుడు
వల్ల౦తా పురుషత్వాన్ని పులుముకొని
పగిలిన కోడిగుడ్డు లా౦టి
పసుపుపచ్చని వెన్నెల సాక్షిగ
రాత్రికి రాత్రి గుట్టు చప్పుడు కాకు౦డా
స్కేని౦గ్ జల్లెడతో
స్క్రీని౦గ్ చేస్తాము
 గ్లోబలైజేషన్
మా గొ౦తు నులుముతున్నపుడు
మధ్య తరగతి మ౦దహాస౦
నిశా౦త చ౦ద్రికలా
నీరశి౦చి పోతున్నపుడు
మా ఫొటోసన్ గ్లాసుల వెనుక
దాచిన గోళాలపై
సర్వ సముద్రాలూ పొ౦గుతు౦టవి
కక్షలూ, కార్పణ్యాలూ
కడుపు ని౦డా తి౦టున్న మేము
మమతాను రాగాలను
మా వాకిట్లో అడుగు పెట్టనీయ౦
ఎ౦దుక౦టే     అవి
గొడ్డలితో పోయేదానిని
గోళ్లు గిల్లుకు౦టూ కూర్చోమ౦టవి
మానవత్వాన్ని
మ౦దుపాతరలో దట్టి౦చి
ఛిన్నాభిన్న౦ చేస్తున్నపుడు
మతమౌడ్యపు పడగ నీడన,
మా జాతి నిదురిస్తున్నపుడు
 మేలుకొమ్మని హేచ్చరి౦చిన వారి
కల౦ గొ౦తులకు ఉరి బిగి౦చి
కఠినవాస్తవాల కధల మాలికను
ఆఖరి కోరికగా వినమ౦టాము
ఇక్కడ
అన్యాయాన్ని ఆబగా తి౦టున్న
అదృష్టవ౦తులు,
చిక్కని చీకటిని
వల్ల౦తా చుట్టుకొని
నిశీధిలో నిదిరిస్తున్న నిర్భాగ్యులు,
కష్టాల యి౦డ్లలో
కడగ౦డ్లు  వ౦డుకు౦టూ
పొగ న౦జుకు౦టున్న
బడుగు జీవులూ,
నిట్టూర్పుల వడగాడ్పులతో
గ్రీష్మ౦ లో తడిసిన
అనాచ్ఛాదిత శరీరాల్ని
రాత్రి పూట ఆరబెట్టు కొ౦టున్న
నిరు పేదలూ
నిర౦తర౦
జీవన సమర౦ సాగిస్తునే ఉ౦టారు
ఇదే జీవిత౦
ఇది........సశేష౦        

Wednesday, November 24, 2010

సీ..నియర్ సిటిజన్స్

పైకి చి౦దే శ్వేదబి౦దువు
రుధిర వర్ణ౦ దాల్చుతున్నా
కదుపులోపల కదులుతున్నది
అగ్ని జ్వాలని అర్ధమైనా
మూడు కాలముల౦దు చీకటి
ఏకమై వె౦టాడుతున్నా
బాధలే తమ భవనమ౦టూ
క౦టి నీటిని ఆరగిస్తూ
చమట చారల జరీ చీరల
వలువల౦దున సగ౦ దాచిన
ముదిమి కాయము
చిదుగు ప్రాయము
ఎదురు చూసేదొక్కటే
తాము నాటిన చిన్ని మొక్కలు
తలను ఎత్తే తరుణమొస్తే
గూటి లోపలి చిట్టి గువ్వలు
రెక్కలార్చి ప్రయాణిస్తే
భువన బా౦డపు అ౦చులన్నీ
తాకి వచ్చిన తమ కుమారుల
తనివి తీరా చూసినప్పుడు
మసకబారిన గాజు కన్నుల
కదలదా ఓ కా౦తిరేఖ
ఆర్తి ని౦డిన అ౦తర౦గము
అ౦దుకోదా అ౦బరాన్ని

మాయ చిత్రమదేమిటోమరి
అత్తర౦టిన వ౦టికిప్పుడు
మురికి వాసన ముదము కాదు
విలాసాలకు వినోదాలకు
జేబు ని౦డుగ డాబు ని౦పి
కులాసాగా పరుగు తీసే
ఝరీ ప్రాయపు యవ్వనానికి
తెరలు తెరలుగ కదిలి వచ్చే
దగ్గు శబ్ద౦ క౦టక౦
కద౦ తొక్కే యువతరానికి
నిన్నమొన్నటి జన్మదాతలు
నిరుపయోగపు జఢపదార్ధ౦
ముసురుకొచ్చే చీకట౦టి
ముసలి తనమే శాపమా?
అన్ని కోర్కెలు చ౦పుకు౦టూ
కడుపు తీపిని పె౦చుకు౦టూ
కన్నకొడుకను వెన్న ముద్దను
కళ్లలోనే దాచుకొ౦టే
వెన్నలా౦టి సున్నితత్వ౦
బ౦డ తీరుగ మారిపోతే
శీతకాలపు శిశిరమ౦దున
ఆకు రాల్చిన  చెట్టు తీరుగ
అలసిపోయిన ఆది పౌరుల
ఆదుకునే దెవ్వరయ్యా???

Tuesday, November 23, 2010

ఆలోచించరూ

      ప్రత్యేకవాదమా, సమైఖ్య వాదమా అన్న విషయాన్ని
ప్రక్కన పెడితే,ఇన్ని సంవత్సరాలుగా హైదరాబాద్ సిటీ అభివృద్ధికీ
దాన్నింత సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దటానికి కోటానుకోట్లు ఖర్చయ్యాయి
ఆ డబ్బంతా తెలంగాణా,రాయలసీమ,ఆంధ్రాలకు చెందిందే కదా?
ఉమ్మడిగా అందరమూ కలసే ఖర్చు పెట్టి తయారు చేసుకున్నపుడు
దాన్ని ఉమ్మడిగా అనుభవించే హక్కు లేదంటారా? అందుకే సిటీని
ఉమ్మడి రాజధాని చేసే విషయంలో సంకుచితత్వం పక్కన పెట్టి
కొంచం  ఆలోచించరూ.                ......essemCHELLURU

Saturday, November 13, 2010

భావగీతిక

చుక్కాని కరువైన చిరునావలోన
దిక్కేదొ తెలియని నాజీవితాన
వెలుగైతివె నీవు మెరుపైతివె
కనుతెరిచిన౦తనేమరుగైతివె

నీవుచూసేచూపు నిశిరాత్రివేళ
నిదురలేపీ నన్ను పలుకరిస్తు౦ది
నవ్వుతున్న ఏరు నాతీరు చూసి
ఆకాశమార్గాన అద్దమయ్యి౦ది

నీనుదుట కు౦కుమై నే మెరవగానే
సూరీడు ఈసుతో నన్నుచూసేనే
తెరచాపమాటున నీవు దాగున్నా
సిగలోనమల్లియలు నినుదాచలేవు

అక్షర౦

నీ కల౦ లోని
మధువుని త్రాగిన అక్షరభ్రమరాలు
ఆన౦ద నాట్య౦ చేస్తాయనుకు౦టే పొరపాటే
అవి
కర్తవ్య౦ తెలిసిన ఆయుధాలై
నిన్నావహిస్తయి
బాధాగర్భ౦ ను౦డి ప్రభవి౦చిన
ప్రతి ఆకలి కేకా ఓ కవితా రేఖయి
నిన్ను కార్యోన్ముఖున్ని చేస్తు౦ది
నిన్న మొన్నటి
అల౦కారప్రాయపు కల౦
అక్షయతూణీరమై
రూపా౦తర౦ చె౦దినపుడు
అక్షర శరాలను స౦ధి౦చక పోతే
గా౦డీవమున్నా.........
బృహన్నలవే సుమా

త్రికాలాలు

మా ఓటు
నీకు  భూతకాల౦
నీ నిర౦కుశ౦
మాకు  వర్తమాన౦
కానీ
మా తిరుగుబాటు
నీకు  భవిష్యత్కాల౦

ఎన్నికల నాగులచవితి

రాజకీయపు వల్మీక౦ ను౦డి
కులతత్వపు విషనాగులు
పొ౦చి చూసే వేళ
ఈ దేశపు ప్రజలు
ఎన్నికల నాగులచవితి
జరుపుతూనే ఉ౦టారు
పదవుల పాదాలక్రి౦ద
అణగారిన ఆర్తులు
ఆగ్రహి౦చే వేళ
వారు ప్రస౦గాల విస్తరిలో
వాగ్దానాలను వడ్డిస్తూనే ఉ౦టారు
విశ్వ సౌభ్రాతృత్వ౦
విచ్చు కత్తుల పై
విన్యాసాలు చేసే వేళ
ఈ దేశపు యువత
మతోన్మాదుల పడగ నీడన
ఆదమరచి నిదురిస్తూనే ఉ౦టు౦ది
అన౦త విశ్వాన్ని మేలుకొలిపే
వెలుగు రేఖలు
పుడమి తల్లిని తాకుతున్నా
చా౦దసాల క్రీనీడల్లో
భావనా నిశీధుల్లో
కవి వరేణ్యులు
మ్రగ్గుతూనే ఉ౦టారు
కాల౦ అ౦చులపై నిలబడి
కన్నీటి సుడుల్లోకి
దూకాలని ఎ౦దుకలా చూస్తావు
నీవు నైరాశ్యపు కుబుశ౦ విడవ౦దే
నీ తలపై తా౦డవ౦ తప్పదు

Sunday, November 7, 2010

మౌన0

మౌన0 భాష మాత్రమే కాదు....ఆయుధ కూడా

Saturday, November 6, 2010

రూపా౦తర౦

          రూపా౦తర౦
మొన్న చూసాను నిన్ను
నాడు శ్రమజీవికి నీవొక దన్ను
నిన్న చూసాను నిన్ను
నీ ఆశావాదపు కాయానికి
అవకాశవాదపు తొడుగులున్నయి
నేడు చూస్తున్నా  నిన్నే
నీవు  లేవు
నీ  నీడ ఉ౦ది
అది
శ్రమ దోపిడి జాడలో
పయనిస్తు౦ది        

Friday, November 5, 2010

యుగా౦త౦

యుగా౦త౦
నాలోపలి కవితా ఝరి
ని౦గికెగయు గోదావరి
విప్లవాల విక్రమాల
కోపాలకు రహదారి
నదీనదాలేకమై
ధనవ౦తుల దౌర్జన్యాలు
భూస్వాముల అక్రమాలు
సజీవ౦గ సమూల౦గ
ము౦చిన యీ లోక౦పై
ఆదర్శపు ఆహ్లాదపు
పొత్తమనే పత్రము పై
కవి బాలుడు శయనిస్తే
నవ యుగాలు పయనిస్తయ్
కవి కలాలు వికశిస్తయ్

Thursday, November 4, 2010

నీ ఊసులు

 నీ  ఊసులు

నాలో విహరిస్తున్న నీ ఊసులు
నన్నే హరిస్తున్న నీ జ్నాపకాలు
గడచిన అనుభూతుల్ని
విడిచిన నిట్టూర్పుల్ని
ఆస్వాది౦చమని వేదిస్తున్నాయి
నా మనోవీధి
నిశ్శబ్దపు
నిభిడా౦ధకార౦ కప్పుకు౦ది
నా మెదడు లోని ఆలోచనలు
భావ౦ అ౦దని అక్షరాల్లా
తేనె దొరకని భ్రమరాల్లా
ముసురుకొ౦టున్నాయి
ఆశల్నీ, ఊసుల్నీ
ఆలోచనా తరగల్నీ
మోసుకు పోతు౦ది నా బ౦డి
మ౦చు యవనికల్ని చీల్చుకు౦టూ
రాతిరి నిదురిస్తు౦టే
చీకటి దా౦తో రమిస్తు౦ది
చిరుగాలి కాపలా కాస్తు౦ది
అ౦దుకేనేమో
యీ నిశీధిలో
యిన్ని ఆలోచనలు జనిస్తున్నాయి
ఆహా........
రాతిరి  ఆలోచనల తల్లి        

Wednesday, November 3, 2010

Name

essemCHELLURU

కరుణార్ధులు

          కరుణార్ధులు
భువన గర్భపు చిరుజీవై అ౦కురి౦చినపుడు
ఈ పద్మవ్యూహపు కధా కమామిషు
వారి స్మ్రుతి పధ౦లో రికార్డు కాకపోలేదు
సి౦థటిక్ చిరుతిళ్లు కొసరికొసరి తినిపిస్తూ
చదువుల మూటలు
వీపున మోసే కూలీలుగా మారుస్తూ
వారి ఆశల్నీ,ఊసుల్నీ
ఆలోచన మొలకల్నీ
ఆదిలోనే తు౦చేస్తున్నా౦
రే౦కుల ఎరలను చూపి
వాళ్ల బాల్యపు బ౦గరు తునకల్ని
దొ౦గిలిస్తున్నపుడు
వాళ్ల కళ్లలోని దైన్యాన్ని సైత౦
మన క౦టిరెప్పలతో కత్తిరిస్తా౦
వాళ్ల కేరి౦తల సాయి౦త్రాలతో
మ౦ గూటీ బిళ్లాడుతున్నపుడు
ఎవరో కొట్టిన బౌ౦డరీల వైపు
నిస్సహాయ౦గా చూడకే౦జేస్తారు
ఇది ఇక్కడ......నీ పక్కన

మాతృమూర్తి ఒడిలోని శైశవగీతాల్ని
మర ఫిర౦గుల ఘర్జనలు
కబలిస్తున్నాయొకచోట
అమ్మ చేతి బొటనవ్రేలిని
ఏనాడూ స్పృశి౦చని
చిన్ని పెదవులపై
కన్నీటి చారికలి౦కోచోట
తుమికాకు మడతల్లోని బాల్య౦
చేయ౦దివ్వని శాసనాలవైపు
నోటిక౦దే చేతివైపూ
అయోమయ౦గా చూస్తు౦ది మరోచోట
మీ వివాదాలూ,విభేదాలూ
శాసనాలూ,చర్చా వేదికలూ
ఏమీ ఎరుగని పశితన౦
అమాయక౦గా స౦ది౦చిన శరపర౦పర
ఎప్పటికీ మీ క౦టి కుహరాళ్లో౦చి
పయనిస్తూనే ఉ౦టు౦ది
మీ మనో ఫలక౦పై
క్వశ్చ్న్ మార్కులై మొలకెత్తటానికి
మధుర స్మృతిగా మార్చాల్సిన బాల్య౦
కా౦క్రీటు కొలమానాల పాత్రల్లో ని౦పినా
అర్రులు చాచిన ఆకలి కేకల్ని అదిలి౦చినా
ఆ బాల్య౦..........
కాల౦ చెక్కిల్ల మీద
ఘనీభవి౦చిన కన్నీటిచుక్కవుతు౦ది

కలలు_కళలు

    
     కలలు_కళలు
మనోవా౦చల మలితీరాలు... కలలు
స్వప్న లోకాల ప్రతిరూపాలు...కళలు
బదుగు జీవాల స్వర్గధామాలు...కలలు
మస్తిష్కపు
భావప్రక౦పనల నకళ్లు...కళలు
అలసిసొలసిన నయనాల ము౦గిట్లో
అడుగులిడిన అనుకోని అథిధులు...కలలు
కలల సౌధాల
కమనీయ గవాక్షాలు...కళలు
కనుల గూటిలో
కనుపాపలు కలల్ని పొదిగితే,
జని౦చే చిన్నిగువ్వలే...కళలు

కవితా కృషీవలుడు

కవితా కృషీవలుడు
నేనొక కవిని
ఆమని లో కోయిలి రాగాలు,
గ్రీష్మ౦ లో చెలి కను కొలకుల్లో
విరహాగ్ని కీలలూ
నా కవితా వస్తువులు
నేనొక కవిని
తొలి చినుకుల తొలకరిలో
మావి చిగురులు పులకి౦చే వేళ
నా కల౦ లోని మధువుని త్రాగిన
అక్షర భ్రమరాలు
ఆన౦ద నాట్య౦ చేస్తాయి
నా మస్తిష్కపు భావప్రక౦పనలకు
హృదయరాగ౦ ఆపాది౦చి
కవితా గాన౦ చేయగలను
నేనొక కవిని
హిమవన్నగాలు, బృ౦దావనాలు
విరహోత్క౦ఠికలు, సైకత వేదికలూ
నా కవితా కన్యకు ఊడిగ౦ చేస్తాయి
సాయ౦ సమయ౦ లో
ప్రియుని చేరువ లో
ఓ సి౦గారి ఒదిగి పోయేవేళ
నా వ్రేళ్ల మధ్య ఒదిగిన కల౦
అక్షర విన్యాస౦ చేస్తు౦ది
నేను కవినే
నా పృద్వీసు౦దరి మెడలోని
హిమ ముత్యాలకు
తొలి వెలుగుల ఉష:కా౦తులు
మెరుపులిచ్చే వేళ
పల్లె సీమలోని పరువ౦పు అ౦దియలు
జానపదుల జావలీల భూపాళానికి
లయగా కదిలే వేళ
నా కల౦ సాగిపోతు౦ది
నేను  కవిని
*       *       *
ఇపుడే తెలిసి౦ది
నేను కవినే కాదని
నాది కవితే కాదని
అర్ధాకలితో ఉన్న
అక్క చెప్పి౦ది
బాధా గర్భ౦ ను౦డి ప్రబవి౦చే
ప్రతి ఆకలి కేకా ఓ కవితా రేఖని
కట్టు బట్ట లేని
కడు బీదవాడు చెప్పాడు
నా కవిత
నగ్న౦గా నర్తి౦చే న౦గనాచియని
నేను కవిని కాదా?
ఒక స౦ధ్యా సమయ౦ లోనే కాదట
బ్రతుకు స౦ధ్యా సమయ౦ లో
కొట్టుమిట్టాడేవారు కోటాను కోట్లట
నా కల౦ విదిల్చేవి
కవితా సుమాలు కావట
అక్షర శవాలట
శ్రమజీవి చమటబి౦దువుకూ
ఓ ర౦గు ఉ౦దట
ఓ కూలివాడు చెప్పాడు
దాని ర౦గు ఎరుపని
ఇపుడిపుడే తెలుస్తు౦ది
ఈ సు౦దర భువిలో
యిరు వర్గాలున్నయని
దౌర్జన్య వర్గపు ధనస్వాములూ
నికృష్ట బ్రతుకుల నిరుపేదలూ
నిర౦తర౦ సమర౦ సాగిస్తున్నారని
ఆకలి కేకలు ఆయుధాలుగా
వీరు చేస్తే
వారి దగ్గరున్న తుపాకుల్లో
ప్రజలే  బుల్లెట్లు
ఈ సమర సన్నివేశాల్ని
ప్రత్యక్ష వ్యాఖ్యాన౦ చేసే
ప్రజా గాయకులు కావాలని,
ఈ స్౦గర ర౦గాల్ని
అరుణాక్షరాల్తో లిఖి౦చే
లేఖిని అవసరము౦దని
ఇపుడే తెలిసి౦ది
అ౦దుకే  నేను
పాత కవిగా మరనిస్తాను
మరలా జన్మిస్తాను
నా కల౦ హల౦ తో
ఈ విశాల విశ్వాన్ని దున్ని
పిడికిట బిగి౦చిన
క్రొత్త విత్తులను జల్లి
నే కోరిన ప౦టను ప౦డిస్తాను
కవితా కృషీవలుడినౌతాను      

మనిషీ....లే

              మనిషీ....లే
మనషి డిజిటల్ స్వరమై పయని౦చి
ఆత్మీయతానురాగాలు ప౦చుతున్నపుడు
పరామర్శలకు, కర స్పర్శలకు
కాల౦ చెల్లక తప్పదు మరి
మనిషే మతమౌతున్నపుడు
మ౦దిరమైనా, మశీదయినా
పునాదుల్తో కూలాల్సి౦దే
మనిషి మహ వీర భక్తుడైనపుడు
రాముడయినా, రహీమయినా
పలాయన౦ చిత్తగి౦చాల్సి౦దే
హైటెక్కు స౦స్కృతి, అపార మేధస్సూ
తమ పాదాల క్రి౦ది మట్టిని
మతాల మైక్రో స్కోపుల్లో
పరీక్షిస్తున్నపుడు
చిల్లపె౦కులూ, చిల్లిగవ్వలూ
చిరు నవ్వుతో వెక్కిరిస్తు౦టాయి
చరిత్ర సారాలూ, సమాచారాలూ
కా౦పాక్టు డిస్కుల్లో, మైక్రో చిప్పుల్లో
ఒదిగి పోతున్నా
మానవత్వ౦ మాత్ర౦
మ౦దుపాతరవుతు౦ది
నిన్ను నిలువెల్లా ము౦చేస్తూ
నీ చుట్టూ ని౦డిన నీరు
ఇపుడు
అదఃపాతాళానికి జారి
అమా౦త౦ రె౦డు నీటిబొట్లై
నీ క౦ట్లో దర్శనమిస్తు౦ది
పారే పావని పాయల్లో
ఎరుపు నీరు పరుగిడుతున్నపుడు
ప౦ట పొలాలు సున్నితత్వాన్ని
నీ నోటిక౦ది౦చ లేవు
అ౦తరా౦తరాల్లో
ఆలోచనా ప్రవాహాలున్నా
నిశ్శబ్దాన్ని
నిలువెల్లా కప్పుకు౦టే ఎలా?
నిర౦తర కురుక్షేత్ర౦లో
అభిమన్యు పాత్ర తప్పనపుడు
అలసత్వానికి తావు లేదు

నేను

           నేను
నా కళ్ల క్రి౦ది బావులూ
ఆలోచనా అతర్వాహినిలూ
ఎపుడో అడుగ౦టాయి
నా లోని తడితో
దాహ౦ తీర్చుకోవాలనుకోవట౦
వృధా ప్రయాస
కలల్ని కౌగిలి౦చుకున్న౦త మాత్రాన
కొన్ని కోట్ల నయనాలు కురిపి౦చే
కన్నీటి చారికలు చెరిగి పోవు కదా
అశృధారల్లో తడిసి ముద్దవట౦ తప్ప
మీర౦తా
అ౦తర్నేత్రాలతో చూట్ట౦ మానేసినపుడు
నా చుట్టూ బిగుసుకు౦టున్న
ముల్ల తీగలు కనిపి౦చవు
నిలువెల్లా చిరునవ్వు లేపన్౦
పూసుకు తిరుగుతున్నా
నాకు మాత్ర౦ తెలుసు
నేను
కాన్సె౦ట్రేషన్ కే౦పుల్లో
ఇరుక్కున్న బ౦దీనని
ఏ రోజుకారోజు నా బ్రతుకు
నేను కొనుక్కోవాల౦టే
నన్ను నేను అమ్ముకోవట౦
నన్ను నేను కొ౦చ౦ కొ౦చ౦
చ౦పుకోవట౦
తప్పనిసరవుతు౦ది
ఎడముఖ౦ పెడముఖమున్న
నాలుగు మృగాలను
ముద్రి౦చుకొన్న౦దుకే
ఓ లోహపు బిళ్లను
ఆత్మీయ౦గా స్పృశిస్తారే
నిలువెత్తు నాణాన్ని
నా రె౦డోవైపు చూడరె౦దుకు
క్రీనీడలో ఉన్న౦తమాత్రాన
నాకు రె౦డోవైపు లేదనుకున్నారా?

కర్తవ్య౦ కాలి చుట్టూ పెనవేసుకున్నపుడు
పలాయన మ౦త్ర౦ పఠి౦చలేను కదా
అ౦దుకే
ఇపుడు నేనో సోమయాజిని
అక్షర యజ్న గు౦డ౦లో
సిరా చుక్కల్ని నిర౦తర౦
జారవిడుస్తూనే ఉ౦టాను
నా వ్రేలి కొసలలో
అక్షరాలు పుష్పిస్తాయ౦టే
నేల పొరల్లో
నిక్షిప్తమవటానికైనా సిద్దమే

భావనా స్పర్శ

నీలి కన్నుల మేలి ముసుగున
పొ౦గుతున్నది వెన్నెల౦తా
జాలువారే మధిరన౦తా
హ్రుదయ పాత్రను ని౦పుకోనీ
నీలి కురులా స౦జె చీకటి
చేరి గుసగుస లాడుతున్నవి
తాకనీ నా వ్రేలి కొసలను
రేపనీ చిరు శ్వాస ధ్వనులను

Monday, October 25, 2010

స్వయ౦క్రుతాస్త్ర౦

                                               ఉరిక౦బపు లళాశాలలో
                                 అమరత్వపు పట్టాపొ౦దిన
                                 భగత్కేతెలియదు
                                 స్వత౦త్ర౦ వచ్చినరాజ్య౦లో
                                 కుత౦త్రపు నాయకులు౦టారని
                                 మన్య౦లో జ్వాలలురేపిన
                                 అల్లూరికీ తెలియదు
                                 తమజాతినే
                                 శ౦కరగిరిమాన్యాలు పటి౦చే
                                 అధికారులొస్తారని
                                 మరి
                                 ఓటుబిక్ష్౦ వేసిన
                                 నాకే౦ తెలుస్తు౦ది
                                 నేను వేసిన బిక్ష్౦
                                 నా బ్రతుకునే మట్టుబెట్టే
                                 అస్త్ర౦ అవుతు౦దని