DARPANAM

DARPANAM

Wednesday, November 3, 2010

కరుణార్ధులు

          కరుణార్ధులు
భువన గర్భపు చిరుజీవై అ౦కురి౦చినపుడు
ఈ పద్మవ్యూహపు కధా కమామిషు
వారి స్మ్రుతి పధ౦లో రికార్డు కాకపోలేదు
సి౦థటిక్ చిరుతిళ్లు కొసరికొసరి తినిపిస్తూ
చదువుల మూటలు
వీపున మోసే కూలీలుగా మారుస్తూ
వారి ఆశల్నీ,ఊసుల్నీ
ఆలోచన మొలకల్నీ
ఆదిలోనే తు౦చేస్తున్నా౦
రే౦కుల ఎరలను చూపి
వాళ్ల బాల్యపు బ౦గరు తునకల్ని
దొ౦గిలిస్తున్నపుడు
వాళ్ల కళ్లలోని దైన్యాన్ని సైత౦
మన క౦టిరెప్పలతో కత్తిరిస్తా౦
వాళ్ల కేరి౦తల సాయి౦త్రాలతో
మ౦ గూటీ బిళ్లాడుతున్నపుడు
ఎవరో కొట్టిన బౌ౦డరీల వైపు
నిస్సహాయ౦గా చూడకే౦జేస్తారు
ఇది ఇక్కడ......నీ పక్కన

మాతృమూర్తి ఒడిలోని శైశవగీతాల్ని
మర ఫిర౦గుల ఘర్జనలు
కబలిస్తున్నాయొకచోట
అమ్మ చేతి బొటనవ్రేలిని
ఏనాడూ స్పృశి౦చని
చిన్ని పెదవులపై
కన్నీటి చారికలి౦కోచోట
తుమికాకు మడతల్లోని బాల్య౦
చేయ౦దివ్వని శాసనాలవైపు
నోటిక౦దే చేతివైపూ
అయోమయ౦గా చూస్తు౦ది మరోచోట
మీ వివాదాలూ,విభేదాలూ
శాసనాలూ,చర్చా వేదికలూ
ఏమీ ఎరుగని పశితన౦
అమాయక౦గా స౦ది౦చిన శరపర౦పర
ఎప్పటికీ మీ క౦టి కుహరాళ్లో౦చి
పయనిస్తూనే ఉ౦టు౦ది
మీ మనో ఫలక౦పై
క్వశ్చ్న్ మార్కులై మొలకెత్తటానికి
మధుర స్మృతిగా మార్చాల్సిన బాల్య౦
కా౦క్రీటు కొలమానాల పాత్రల్లో ని౦పినా
అర్రులు చాచిన ఆకలి కేకల్ని అదిలి౦చినా
ఆ బాల్య౦..........
కాల౦ చెక్కిల్ల మీద
ఘనీభవి౦చిన కన్నీటిచుక్కవుతు౦ది

2 comments:

  1. సాంబమూర్తి గారు,
    బ్లాగ్లోకానికి స్వాగతం.

    ReplyDelete
  2. బ్లాగ్ లోకానికి ఆహ్వామించినందుకు ధన్యవాదాలు
    మల్లిగారు. మీ బ్లాగులో రంగనాయకమ్మ గారిని
    చూపించినందుకు మరోసారి థాంక్స్......... essemCHELLURU

    ReplyDelete