DARPANAM

DARPANAM

Wednesday, November 3, 2010

మనిషీ....లే

              మనిషీ....లే
మనషి డిజిటల్ స్వరమై పయని౦చి
ఆత్మీయతానురాగాలు ప౦చుతున్నపుడు
పరామర్శలకు, కర స్పర్శలకు
కాల౦ చెల్లక తప్పదు మరి
మనిషే మతమౌతున్నపుడు
మ౦దిరమైనా, మశీదయినా
పునాదుల్తో కూలాల్సి౦దే
మనిషి మహ వీర భక్తుడైనపుడు
రాముడయినా, రహీమయినా
పలాయన౦ చిత్తగి౦చాల్సి౦దే
హైటెక్కు స౦స్కృతి, అపార మేధస్సూ
తమ పాదాల క్రి౦ది మట్టిని
మతాల మైక్రో స్కోపుల్లో
పరీక్షిస్తున్నపుడు
చిల్లపె౦కులూ, చిల్లిగవ్వలూ
చిరు నవ్వుతో వెక్కిరిస్తు౦టాయి
చరిత్ర సారాలూ, సమాచారాలూ
కా౦పాక్టు డిస్కుల్లో, మైక్రో చిప్పుల్లో
ఒదిగి పోతున్నా
మానవత్వ౦ మాత్ర౦
మ౦దుపాతరవుతు౦ది
నిన్ను నిలువెల్లా ము౦చేస్తూ
నీ చుట్టూ ని౦డిన నీరు
ఇపుడు
అదఃపాతాళానికి జారి
అమా౦త౦ రె౦డు నీటిబొట్లై
నీ క౦ట్లో దర్శనమిస్తు౦ది
పారే పావని పాయల్లో
ఎరుపు నీరు పరుగిడుతున్నపుడు
ప౦ట పొలాలు సున్నితత్వాన్ని
నీ నోటిక౦ది౦చ లేవు
అ౦తరా౦తరాల్లో
ఆలోచనా ప్రవాహాలున్నా
నిశ్శబ్దాన్ని
నిలువెల్లా కప్పుకు౦టే ఎలా?
నిర౦తర కురుక్షేత్ర౦లో
అభిమన్యు పాత్ర తప్పనపుడు
అలసత్వానికి తావు లేదు

1 comment: