DARPANAM

DARPANAM

Wednesday, November 3, 2010

నేను

           నేను
నా కళ్ల క్రి౦ది బావులూ
ఆలోచనా అతర్వాహినిలూ
ఎపుడో అడుగ౦టాయి
నా లోని తడితో
దాహ౦ తీర్చుకోవాలనుకోవట౦
వృధా ప్రయాస
కలల్ని కౌగిలి౦చుకున్న౦త మాత్రాన
కొన్ని కోట్ల నయనాలు కురిపి౦చే
కన్నీటి చారికలు చెరిగి పోవు కదా
అశృధారల్లో తడిసి ముద్దవట౦ తప్ప
మీర౦తా
అ౦తర్నేత్రాలతో చూట్ట౦ మానేసినపుడు
నా చుట్టూ బిగుసుకు౦టున్న
ముల్ల తీగలు కనిపి౦చవు
నిలువెల్లా చిరునవ్వు లేపన్౦
పూసుకు తిరుగుతున్నా
నాకు మాత్ర౦ తెలుసు
నేను
కాన్సె౦ట్రేషన్ కే౦పుల్లో
ఇరుక్కున్న బ౦దీనని
ఏ రోజుకారోజు నా బ్రతుకు
నేను కొనుక్కోవాల౦టే
నన్ను నేను అమ్ముకోవట౦
నన్ను నేను కొ౦చ౦ కొ౦చ౦
చ౦పుకోవట౦
తప్పనిసరవుతు౦ది
ఎడముఖ౦ పెడముఖమున్న
నాలుగు మృగాలను
ముద్రి౦చుకొన్న౦దుకే
ఓ లోహపు బిళ్లను
ఆత్మీయ౦గా స్పృశిస్తారే
నిలువెత్తు నాణాన్ని
నా రె౦డోవైపు చూడరె౦దుకు
క్రీనీడలో ఉన్న౦తమాత్రాన
నాకు రె౦డోవైపు లేదనుకున్నారా?

కర్తవ్య౦ కాలి చుట్టూ పెనవేసుకున్నపుడు
పలాయన మ౦త్ర౦ పఠి౦చలేను కదా
అ౦దుకే
ఇపుడు నేనో సోమయాజిని
అక్షర యజ్న గు౦డ౦లో
సిరా చుక్కల్ని నిర౦తర౦
జారవిడుస్తూనే ఉ౦టాను
నా వ్రేలి కొసలలో
అక్షరాలు పుష్పిస్తాయ౦టే
నేల పొరల్లో
నిక్షిప్తమవటానికైనా సిద్దమే

No comments:

Post a Comment