DARPANAM

DARPANAM

Thursday, February 16, 2012

మూసిన రెప్పల మాటున 
కోటి ఊసుల సాక్షాత్కారం 
చూసిన నా కన్నులకేమో 
పలు వన్నెలు సాకారం 

Monday, February 13, 2012

మైత్రేయి గారూ 
 సరసి గారి గురించి ఎంత వ్రాసినా తక్కువే 
అయినా నాకిష్టమైన కార్టూనిస్ట్ గురించి
   మీరు చాలా బాగా వ్రాసారు. ధన్యవాదాలు 

Thursday, February 9, 2012

వచ్చి వెళ్లావు కదూ?

నీ 
ఆగమనం 
నాకెరుకే
నీ 
పలుకరి౦పే          
లేకుంటే 
ఈ 
ఆకుపచ్చని 
మొక్కలకు 
ఇన్ని రంగుల 
నవ్వులెక్కడివి

Friday, February 3, 2012

పేరేమిటబ్బా?

నక్కలు 
నీతి శాస్త్రం ప్రభోదిస్తున్నాయి 
కుక్కలూ,కూనలూ
విశ్వాసం ప్రకటిస్తున్నాయి 
కుక్కుటాలు 
మేల్కొలపటం మానేశాయి 
మేకలు
ఆకుల్లేక అల్లాడుతున్నాయి 
ఇదీ 
నే చూసిన దృశ్యం 
దీని పేరేమిటబ్బా 
ఆహా ......
గుర్తొచ్చింది 

ప్రజాస్వామ్యం కదూ.....