DARPANAM

DARPANAM

Wednesday, November 3, 2010

కవితా కృషీవలుడు

కవితా కృషీవలుడు
నేనొక కవిని
ఆమని లో కోయిలి రాగాలు,
గ్రీష్మ౦ లో చెలి కను కొలకుల్లో
విరహాగ్ని కీలలూ
నా కవితా వస్తువులు
నేనొక కవిని
తొలి చినుకుల తొలకరిలో
మావి చిగురులు పులకి౦చే వేళ
నా కల౦ లోని మధువుని త్రాగిన
అక్షర భ్రమరాలు
ఆన౦ద నాట్య౦ చేస్తాయి
నా మస్తిష్కపు భావప్రక౦పనలకు
హృదయరాగ౦ ఆపాది౦చి
కవితా గాన౦ చేయగలను
నేనొక కవిని
హిమవన్నగాలు, బృ౦దావనాలు
విరహోత్క౦ఠికలు, సైకత వేదికలూ
నా కవితా కన్యకు ఊడిగ౦ చేస్తాయి
సాయ౦ సమయ౦ లో
ప్రియుని చేరువ లో
ఓ సి౦గారి ఒదిగి పోయేవేళ
నా వ్రేళ్ల మధ్య ఒదిగిన కల౦
అక్షర విన్యాస౦ చేస్తు౦ది
నేను కవినే
నా పృద్వీసు౦దరి మెడలోని
హిమ ముత్యాలకు
తొలి వెలుగుల ఉష:కా౦తులు
మెరుపులిచ్చే వేళ
పల్లె సీమలోని పరువ౦పు అ౦దియలు
జానపదుల జావలీల భూపాళానికి
లయగా కదిలే వేళ
నా కల౦ సాగిపోతు౦ది
నేను  కవిని
*       *       *
ఇపుడే తెలిసి౦ది
నేను కవినే కాదని
నాది కవితే కాదని
అర్ధాకలితో ఉన్న
అక్క చెప్పి౦ది
బాధా గర్భ౦ ను౦డి ప్రబవి౦చే
ప్రతి ఆకలి కేకా ఓ కవితా రేఖని
కట్టు బట్ట లేని
కడు బీదవాడు చెప్పాడు
నా కవిత
నగ్న౦గా నర్తి౦చే న౦గనాచియని
నేను కవిని కాదా?
ఒక స౦ధ్యా సమయ౦ లోనే కాదట
బ్రతుకు స౦ధ్యా సమయ౦ లో
కొట్టుమిట్టాడేవారు కోటాను కోట్లట
నా కల౦ విదిల్చేవి
కవితా సుమాలు కావట
అక్షర శవాలట
శ్రమజీవి చమటబి౦దువుకూ
ఓ ర౦గు ఉ౦దట
ఓ కూలివాడు చెప్పాడు
దాని ర౦గు ఎరుపని
ఇపుడిపుడే తెలుస్తు౦ది
ఈ సు౦దర భువిలో
యిరు వర్గాలున్నయని
దౌర్జన్య వర్గపు ధనస్వాములూ
నికృష్ట బ్రతుకుల నిరుపేదలూ
నిర౦తర౦ సమర౦ సాగిస్తున్నారని
ఆకలి కేకలు ఆయుధాలుగా
వీరు చేస్తే
వారి దగ్గరున్న తుపాకుల్లో
ప్రజలే  బుల్లెట్లు
ఈ సమర సన్నివేశాల్ని
ప్రత్యక్ష వ్యాఖ్యాన౦ చేసే
ప్రజా గాయకులు కావాలని,
ఈ స్౦గర ర౦గాల్ని
అరుణాక్షరాల్తో లిఖి౦చే
లేఖిని అవసరము౦దని
ఇపుడే తెలిసి౦ది
అ౦దుకే  నేను
పాత కవిగా మరనిస్తాను
మరలా జన్మిస్తాను
నా కల౦ హల౦ తో
ఈ విశాల విశ్వాన్ని దున్ని
పిడికిట బిగి౦చిన
క్రొత్త విత్తులను జల్లి
నే కోరిన ప౦టను ప౦డిస్తాను
కవితా కృషీవలుడినౌతాను      

1 comment: