DARPANAM

DARPANAM

Thursday, August 11, 2011

స్వయంకృతాస్త్రం



 ఉరిక౦బపు కళాశాలలో
 అమరత్వపు పట్టాపొ౦దిన
 భగత్ కే తెలియదు 
 స్వత౦త్ర౦ వచ్చినరాజ్య౦లో
 కుత౦త్రపు నాయకులు౦టారని
 మన్య౦లో జ్వాలలురేపిన
 అల్లూరికీ తెలియదు
 తమజాతినే 
శ౦కరగిరిమాన్యాలు పటి౦చే
అధికారులొస్తారని
  మరి 
ఓటుబిక్ష౦ వేసిన
నాకే౦ తెలుస్తు౦ది
నేను వేసిన బిక్ష౦
నా బ్రతుకునే మట్టుబెట్టే 
అస్త్ర౦ అవుతు౦దని  

2 comments:

  1. మూర్తి గారు ! నమస్తే !
    లోతైన భావ పరిమళాలను ఘాటుగా విరజిమ్ముచున్నవి .. మీ భావ కవితాసుమములు. మరిన్ని సుమములు పూచి వికసించాలని కోరుతూ ...

    ReplyDelete
  2. ధన్యుణ్ణి శాస్త్రిగారూ

    ReplyDelete