DARPANAM

DARPANAM

Wednesday, May 11, 2011

ఆమె(ప్రకృతి )


       ఆమె(ప్రకృతి )
నీ ప్రయోజనాలకై
నిలువెల్లా నీవు చేసిన గాయాలు
నిరంతరం ఆమెను సలుపుతూనే ఉన్నాయి
నీ స్వప్న లోకాల సాక్షాత్కారం కోసం
ఆమె అణువణువూ
చిన్నాభిన్నమవుతుంది
ఆమె ప్రాణం నీకు
ఉఛ్వాశాలవుతున్నా
నీ నిశ్వాసా దుర్గంధాలు
ఆమెను దగ్ధదృశ్యం చేస్తున్నాయి
ఆమె పొత్తిళ్లలో
ఒత్తిగిల్లుతున్న నీవు
ఫలపుష్పాలను ఆస్వాదిస్తూనే
ఆమె వ్రేళ్లను సాంతం పెరికేస్తున్నావు
ఇప్పుడామె నేత్రాలు
నిర్మల కటాక్ష వీక్షణాలకు
ఆలవాలం కాదు
భయానక జ్వాలాముఖీ జ్వలిత
కిరణద్వయం
ఆమె స్పర్శ
మాతృ హృదయ గర్భిత
మమతానురాగం కాదు
నిన్నూ,నీ స్వార్ధ ప్రయోజనాన్ని
అమాంతం
అదఃపాతాళానికి త్రొక్కే
పదఘట్టనల సునామీ

6 comments:

  1. పర్యావరణ పరిరక్షణ దృష్టితో రాసిన ఈ కవిత చాలా బావుంది. ఇటీవల ఇంత చక్కని కవిత చదవలేదు ఈ అంశంతో. చాలా చక్కగా రాసారు.ఇదే మొదటి సారి మీ బ్లాగ్ చూడడం. మిగిలినవి కూడా చదివాక మళ్ళీ రాస్తాను. ధన్యవాదాలు.

    ReplyDelete
  2. చాలా బాగుందండీ!

    ReplyDelete
  3. చాలా బాగా వ్రాశారు సాంబమూర్తి గారు

    ReplyDelete
  4. థాంక్యూ శ్రీకాంత్

    ReplyDelete