భావగీతం
చుక్కాని కరువైన చిరునావలోన
దిక్కేదొ తెలియని నా జీవితాన
వెలుగైతివే నీవు మెరుపైతివే
కనుతెరిచినంత కనుమరుగైతివే
నీవు చూసేచూపు నిశిరాత్రి వేళ
నిదురలేపీ నన్ను పలుకరిస్తుంది
నవ్వుతున్నా ఏరు నా తీరు చూడ
ఆకాశ అద్దాన జాబిలయ్యింది "చుక్కాని "
నీ నుదుట కుంకుమై నే నిలువగానే
సూరీడు ఈసుతో నన్ను చూసేను
తెరచాప మాటునా నీవు దాగున్నా
సిగలోన మల్లియలు నిను దాచలేవు "చుక్కాని"
చుక్కాని కరువైన చిరునావలోన
దిక్కేదొ తెలియని నా జీవితాన
వెలుగైతివే నీవు మెరుపైతివే
కనుతెరిచినంత కనుమరుగైతివే
నీవు చూసేచూపు నిశిరాత్రి వేళ
నిదురలేపీ నన్ను పలుకరిస్తుంది
నవ్వుతున్నా ఏరు నా తీరు చూడ
ఆకాశ అద్దాన జాబిలయ్యింది "చుక్కాని "
నీ నుదుట కుంకుమై నే నిలువగానే
సూరీడు ఈసుతో నన్ను చూసేను
తెరచాప మాటునా నీవు దాగున్నా
సిగలోన మల్లియలు నిను దాచలేవు "చుక్కాని"
బ్లాగ్ వేదికను సంప్రదించినందుకు ధన్యవాదములు.మీ బ్లాగును బ్లాగు వేదికకు జతచేసాము.గమనించగలరు.బ్లాగ్ వేదిక లోగో మీ బ్లాగుకు అతికించి సహకరించగలరు. బ్లాగ్ వేదిక టీం.
ReplyDelete