DARPANAM

DARPANAM

Tuesday, November 25, 2014

                 భావగీతం 

చుక్కాని కరువైన చిరునావలోన 
దిక్కేదొ తెలియని నా జీవితాన 
వెలుగైతివే నీవు మెరుపైతివే
 కనుతెరిచినంత కనుమరుగైతివే  

నీవు చూసేచూపు నిశిరాత్రి వేళ 
నిదురలేపీ నన్ను పలుకరిస్తుంది 
నవ్వుతున్నా ఏరు నా తీరు చూడ 
ఆకాశ అద్దాన జాబిలయ్యింది                "చుక్కాని "

నీ నుదుట కుంకుమై నే నిలువగానే 
సూరీడు ఈసుతో  నన్ను చూసేను 
తెరచాప మాటునా నీవు దాగున్నా 
సిగలోన మల్లియలు నిను దాచలేవు      "చుక్కాని" 

1 comment:

  1. బ్లాగ్ వేదికను సంప్రదించినందుకు ధన్యవాదములు.మీ బ్లాగును బ్లాగు వేదికకు జతచేసాము.గమనించగలరు.బ్లాగ్ వేదిక లోగో మీ బ్లాగుకు అతికించి సహకరించగలరు. బ్లాగ్ వేదిక టీం.

    ReplyDelete