DARPANAM

DARPANAM

Wednesday, November 19, 2014

పొగచూరిన జీవితాలు 
అగచాట్లకు ఆనవాలు
 పవరఫుల్ బైకులతో 
లవ్వర్ తో రైడింగులు 
మితిమీరిన గమనాలు 
అతివేగపు సాహసాలు 
కళాశాల చదువంటే 
కులాసాల సంబరాలు 
నిదురనుండి లేస్తూనే 
సెల్లుఫోను గిల్లుకుంటు 
ఏండ్రాయిడ్ మందిరాన 
ఫేసుబుక్కు దర్శనాలు 
ప్రేమంటే యాసిడ్లూ
 ప్రేమంటే కత్తిపోట్లు
 ఎదిరించే లేడి కూన
 తెగనరికే కర్కశాలు 
 ఇదేనా ఇదేనా 
పరుగెత్తే యువవాహిని 
మనకిచ్చే సందేశం 
కనిపెంచే మాతృమూర్తి 
కన్నీట్లో మునుగుతున్నా 
పెంచుకున్న ఆశలన్నీ 
 ఎండమావులవుతున్నా
మీ మనసులు మారవా 
ఆగడాలు ఆగవా  

2 comments:

  1. మీరు బ్లాగిల్లు ఉత్తమ బ్లాగులలో చేరుటకు అభ్యర్ధన పంపి ఉన్న్నారు . కానీ మీ మెయిల్ అడ్రస్స్ పంపలేదు . దయచేసి వెంటనే బ్లాగిల్లు ను సంప్రదించగలరు

    ReplyDelete
    Replies
    1. శ్రీనివాస్ గారూ
      పరిశీలించినందుకు ధన్యవాదాలు నా మెయిల్ ఎడ్రస్ essemchelluru@gmail.com

      Delete